calender_icon.png 2 May, 2025 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్సీ కవితకు లేదు

26-04-2025 07:35:04 PM

కరీంనగర్ (విజయక్రాంతి): కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Congress leader Rahul Gandhi)ని విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు లేదని కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్  జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజిమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసులో అడ్డంగా దొరికి జైలు పాలై ఆ తర్వాత మితిస్థిమితం కోల్పోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయంలో బలంగా ఉన్నానని అపోహ లో దురుద్దేశ్యముతో రాహుల్ గాంధీని కల్వకుంట్ల కవిత విమర్శించడం జరుగుతుందని పేర్కొన్నారు. కల్వకుంట్ల కవిత జాగృతి పేరుతో వందల కోట్లు సంపాదించింది మీరు కదా ప్రశ్నించారు. రాహుల్ గాంధీని విమర్శిస్తే ఊరుకునే పరిస్థితి లేదని ఖబడ్దార్ కల్వకుంట్ల కవిత అంటూ హెచ్చరించారు.