calender_icon.png 23 August, 2025 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూజారి మృతికి ఎమ్మెల్యే సంతాపం

23-08-2025 12:42:00 PM

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి):  తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన బెల్లంపల్లి రామాలయ ప్రధాన అర్చకులు చిమిరాల వేణుగోపాలచార్యులు ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) నివాళులర్పించారు. శుక్రవారం రాత్రి తీవ్ర అనారోగ్యంతో శ్రీ కోదండ రామాలయం ప్రధాన పూజారి వేణుగోపాల ఆచార్యులు  మరణించారు. ఈ విషయం తెలుసుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పూజారి  నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలి పారు. బెల్లంపల్లి గడ్డం వినోద్ వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు, మునిమంద రమేష్, దావ రమేష్ ఉన్నారు.