23-08-2025 01:31:03 PM
హైదరాబాద్: మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) శనివారం నిధులు విడుదల చేసింది. ముసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (Musi River Front Development Corporation Limited) కోసం 2వ త్రైమాసిక విడుదలగా రూ. 375 కోట్లు మంజూరు చేసింది. ఈ కేటాయింపు 2025-26 సంవత్సరానికి రూ. 1,500 కోట్ల బడ్జెట్ కేటాయించిన నిధుల నుంచి విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్లాన్ స్కీమ్ కింద ఉపయోగిస్తారు. ప్రాజెక్ట్ అమలు కోసం ఈ మొత్తాన్ని ఎంఆర్డీసీఎల్ పీడీ ఖాతాకు జమ చేశారు. సుందరీకరణ, కాలుష్య నియంత్రణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా హైదరాబాద్‌లోని మూసీ నదిని పునరుద్ధరించడం, మార్చడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ముఖ్యమైన పనులలో పార్కులు, నడక మార్గాలు, సైక్లింగ్ ట్రాక్‌లు, మురుగునీటి శుద్ధి కర్మాగారాలు, వరదలను నివారించడానికి కట్టల నిర్మాణం, నదీ తీరం వెంబడి సాంస్కృతిక, వినోద ప్రదేశాలు తెచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నారు.