calender_icon.png 23 August, 2025 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేర్మట గ్రామంలో కాబోయే సర్పంచ్ ఎవరు...?

23-08-2025 02:11:42 PM

  1.  ఊహించని వ్యక్తి సర్పంచ్ అవుతారని ఆ వ్యక్తి ఎవరో వేచి చూడాల్సిందే..?
  2.  ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసే వారికి సర్పంచ్ పదవి కట్టబెడతారా..?
  3.  నిత్యం ప్రజా పోరాటాల్లో ముందుండే నాయకుని ఎన్నుకుంటారా...?

చండూరు,(విజయక్రాంతి): చండూరు మండల పరిధిలోనినేర్మట గ్రామంలో(Narmetta village) ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ఆ సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు ముందుండి పోరాడుతుంటారు. ఈ గ్రామంలో ఎస్సీ కాలనీలో ఇండ్లపైన కరెంటు మెయిన్ లైన్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయని తెలిసి పరిష్కారం అయ్యేంతవరకు ఆ వ్యక్తి ముందున్నారు. ప్రాథమిక ఉన్నంత పాఠశాల పాఠశాల గ్రౌండ్ మరొకరు కబ్జా చేస్తున్నారని ఆ భూమిని పాఠశాలకు చెందే విధంగా గతంలో కోర్టు తీర్పు ప్రకారం ఆ భూమిపై పోరాటం కొనసాగించారు. కానీ కొంతమంది అతనిపైన లేని పోని ఆరోపణలు చేసి బద్నాం చేసే ప్రయత్నం చేశారు. అయన గాని ఈ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో వాటికి పరిష్కారం కావాలని ముందుండి పోరాడుతుంటారు.

ఈ గ్రామంలోని రోడ్డు సమస్యలు, మురికి కాలువల నిర్మాణం చేపట్టాలని, ఆ పనులకు అవసరమైన నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో నిరుపేదలకు రాకుండా అనర్హులకు ఇస్తున్న సమాచారాన్ని తెలుసుకొని ఇల్లు లేని నిరుపేదలను ఏకం చేసి మండల రెవెన్యూ తహసిల్దార్  కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అంతటితో ప్రభుత్వ అధికారులు వెంటనే రీ సర్వే చేసి మరొక లిస్ట్ పంపాలని ఆదేశించడంతో  మొట్టమొదటి లిస్టు క్యాన్సల్ కావడంతో రెండవ లిస్టులో కొంతమంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చే విధంగా ఆయన చేసిన పోరాటం మరువలేనివి. ఆ వ్యక్తికి మాత్రం ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో ఇల్లు మాత్రం రాలేదు. ప్రజా పోరాటాలు చేస్తున్న వ్యక్తికి ఇల్లు రాలేదంటూ, మరి సామాన్య పేదవారికి ఇల్లు ఎలా వస్తుందని ఆ గ్రామములో గుసగుసలు లేకపోలేదు.ఈ గ్రామంలో పేదలకు ఏ పని కావాలన్నా తన కుటుంబాన్ని లెక్కచేయకుండా ఎప్పుడు జనం మధ్యలో తిరుగుతూ ప్రజల కోసం నిత్యం పోరాడుతుంటారు.

ఈ గ్రామంలో విద్యార్థులు, ప్రజలుబస్సు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ గ్రామానికి బస్సు రావాలని ఆయన మనసులో గట్టిగా అనుకున్నారు. అనుకున్న విధంగా కరోనా సమయంలో ఈ గ్రామానికి బస్సు వచ్చే విధంగా ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఈ గ్రామంలో ఆయన ఒక వార్డు మెంబర్ కూడా ఏనాడు పోటీ చేయలేదు. కానీ ఈ గ్రామ ప్రజలందరూ ఇలాంటి వ్యక్తి సర్పంచ్ అయితే మన గ్రామం బాగుపడుతుందని ఈ గ్రామ ప్రజల్లో సందేహం లేకపోలేదు. కానీ ఆ వ్యక్తి ఆర్థికంగా చాలా పేదవారు.

డబ్బుంటే మాత్రం అందరి కంటే ముందు గెలిచేవాడని ప్రజల మనసులో లేకపోలేదు. ఆ గ్రామ ప్రజలు మాత్రం ఇతనికి ఓటు వేస్తే సేవ చేస్తారని నమ్మకం ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ గ్రామంలో ప్రజా సమస్యలతో ముందుండి పోరాడుతూ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోవడం వలన అభివృద్ధితోపాటు ప్రజా సమస్యలు పరిష్కారం కావు. గ్రామానికి పెద్ద గ్రామ సర్పంచ్. గ్రామ సర్పంచ్ లేకపోతే గ్రామ సమస్యలు "ఎక్కడ వేసిన గొంగడి అక్కడే" అన్నచందంగా మారుతుంది.  ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే విధంగా చొరవ చూపాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.ఏది ఏమైనా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారో, ఎవరిని గెలిపిస్తారో వేచి చూడాల్సిందే...