23-08-2025 12:46:26 PM
మణికొండ: పలు ప్రమాదాలకు కారణమవుతున్న కేబుల్ వైర్స్ తొలగించాలని తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఇచ్చిన ఆదేశాల మేరకు మణికొండ అల్కాపురి టౌన్ షిప్ రోడ్ నెంబర్ 28లో కేబుల్ వైర్స్ ను తొలగించారు. డీఈ రమేష్ చంద్ర, ఏడీ అంబేంద్కర్, ఏఈ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ సిబ్బంది ప్రమాదకరంగా ఉన్న ఇంటర్నెట్ వైర్స్, కేబుల్ వైర్స్ ను తొలగించారు. వర్షాకాలంలో ప్రమాదాలు జరగకుండా తక్షణమే విద్యుత్ శాఖ స్పందించి కేబుల్ వైర్స్ తొలగించడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.