16-11-2025 08:45:35 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని భీమన్న గుట్టను పరిరక్షించాలని కోరుతూ ముదిరాజ్ సంఘం నాయకులు ఆదివారం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను కలిసి వినతి పత్రం అందించారు. ముదిరాజ్ కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న భీమన్న కుట్టను కొందరు ఆక్రమించుకుంటున్నారని దీనిపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకునేలా ముత్తిడి తేవాలని ముదిరాజ్ సంఘం నాయకులు ఆయనకు విన్నవించారు, ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.