16-11-2025 09:04:55 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సెలవు రోజు కావడంతో తమ్ముడిని కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుందామని వచ్చిన చిన్నారికి కారు రూపంలో మృత్యువు ఎదురై అనంత లోకాలకు చేరుకుంది. తమ్ముడిని కలిసిన ఆనందం కాసే పైన లేకుండానే మృతి చెందడంతో తమ్ముడుతో పాటు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం, తుళ్లూరు గ్రామానికి చెందిన శివ హాసిని(8) తన తమ్ముడు మొట శ్రావణ్ సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రి నగర్ గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తుండగా ఆదివారం సెలవు రోజు కావడంతో నానమ్మ లక్ష్మి పెద్దమ్మలతో కలిసి తమ్ముడి వద్దకు వచ్చి తన తమ్ముడితో సరదాగా గడుపుదామని హాస్టల్ నుండి నలుగురు బయటికి వచ్చి రోడ్డు దాటుతుండగా కరీంనగర్ నుండి పెద్దపల్లికి వెళ్తున్న బోలోరా వాహనం రూపంలో వచ్చిన మృత్యువు శివ హాసినిని ఢీకొట్టడంతో తీవ్రగాయాలు కాగా హుటాహుటిన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందిందని పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి తండ్రికి సమాచారం అందించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.