calender_icon.png 16 November, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నకల్వల స్టేజి వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

16-11-2025 08:52:21 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల స్టేజి వద్ద రాజీవ్ రహదారిపై కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతిచెందాడు. ఆదివారం గ్రామానికి చెందిన రాపెళ్లి రాజేశం ఇంట్లోని చెత్తను రోడ్డు పక్కన ఉన్న డంపులో పారబోసి, తిరిగి ఇంట్లోకి వెళుతుండగా కరీంనగర్ నుండి పెద్దపల్లి వైపు అతివేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టడంతో రాపల్లి రాజేశం అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు నమోదు చేసుకొని శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.