calender_icon.png 16 November, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెడ్డి సంఘం అధ్వర్యంలో సహన రెడ్డికి ఘన సన్మానం

16-11-2025 08:42:14 PM

మంథని (విజయక్రాంతి): పీజీ జనరల్ మెడిసిన్ లో రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించిన సహన రెడ్డిని ఆదివారం సాయంత్రం మంథని రెడ్డి సంక్షేమ సంఘం భవనంలో రెడ్డి సంఘం అధ్యక్షులు ముసుకుల సురేందర్ రెడ్డి అధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో పీజీ జనరల్ మెడిసిన్ లో 9వ ర్యాంకు సాధించిన సహన రెడ్డిని అభినందించారు. ఇదే పట్టుదలతో చదివి మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. సహనారెడ్డిని ఇప్పటి యువత ఆదర్శంగా తీసుకుని చదువులో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు.