calender_icon.png 16 November, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోయలారీని తిప్పి పంపిన అధికారులు

16-11-2025 08:47:09 PM

కుంటాల (విజయక్రాంతి): కుంటాల మండల కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన సోయా పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో నాణ్యత ప్రకారం తూకం వేసి గోదాములకు పంపితే నాసిరకం అంటూ అధికారులు ధాన్యాన్ని తిప్పి పంపినట్టు రైతులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం తూకం వేసిన సోయ బ్యాగులను నాఫెడ్ గోదాములకు తరలిస్తే అక్కడ అధికారులు అక్కడ పంట నాణ్యతగా లేదని తిరిగి అదే లారీలో కొనుగోలు కేంద్రానికి వాపస్ పంపడంతో పంటను అమ్ముకున్న రైతులు ఇబ్బంది పడుతున్నారు, జిల్లా అధికారులు జోక్యం చేసుకొని పంటను ప్రభుత్వ జోక్యం చూసుకుని రైతులకు న్యాయం చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు.