calender_icon.png 16 November, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత ఉపరాష్ట్రపతిని సత్కరించిన సీఎం రేవంత్

16-11-2025 09:00:41 PM

హైదరాబాద్: హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్(Vice President CP Radhakrishnan) గౌరవార్థం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపరాష్ట్రపతిని సత్కరించారు. రాజ్ భవన్‌లో గవర్నర్ నిర్వహించిన ఈ తేనీటి విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.