16-11-2025 08:49:42 PM
పట్టించుకొని అధికారులు
సిమెంట్ రోడ్డు పనులు కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం
ముత్తారం (విజయక్రాంతి): మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన రూ.5 లక్షల సిమెంట్ రోడ్డు పనులు నాసిరకంగా చేస్తున్నారని ఏఈ జగదీష్ ను చరవాణిలో గ్రామస్తులు సంప్రదించగా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో డిఈని సంప్రదించగా ముత్తారంలో సీసీ రోడ్డు పనులు నాసిరకంగా చేస్తున్నారని, అడగగా వర్క్ వద్ద అధికారులు ఎవరూ లేరని చెప్పడంతో వెంటనే ఏఈ పంపిస్తామన్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఇదే అదునుగా భావించిన కాంట్రాక్టు ఇష్టానుసారంగా రోడ్డు చదును చేసి డస్ట్ పోయకపోవడం, మట్టిపై నేరుగా కాంక్రీట్ చేయడం లేదని, సిమెంటు గ్రానివర్ నిష్పత్తులు సరిగా లేకపోవడం అంతలోనే వచ్చిన ఏఈని గ్రామస్తులు నిలదీయడంతో పని నాశరకంగా ఉందని గుర్తించి నిలిపివేశారు. ఇప్పటికే వేసిన నాసిరకం కాంక్రీట్ ను పూర్తిగా తొలగించి మళ్లీ ప్రమాణాలకు అనుగుణంగా వేయాలని సహాయక ఇంజనీరు నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు.