16-11-2025 09:53:24 PM
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రమేష్
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): సమాజంలో మీడియా పాత్ర కీలకం అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రుప్నర్ రమేష్ అన్నారు. జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా ఆదివారం బీసీ సంఘం కార్యాలయంలో సాయంత్రం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం (టియుడబ్ల్యూజే -ఐజేయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్, జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్ లకు శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవ స్పృహతో జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ అనేక సేవలు అందిస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై అనేక కథనాలు రాస్తూ సమస్యలు పరిష్కారం కోసం పాత్రికేయులు కృషి చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వైరాగాడే మారుతి పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్, ఆర్ఎంపి వైద్యుల మండల అధ్యక్షుడు పొన్నాల నారాయణ, బీసీ సంఘం ఆసిఫాబాద్ మండల అధ్యక్షుడు సిరికొండ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.