2 July, 2026 | 3:17 PM

Breaking News

ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •  

ఎంపీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు

06-06-2025 10:46 AM

కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే మురళి నాయక్

మహబూబాబాద్, (విజయక్రాంతి): మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్(MP Balaram Nayak) జన్మదిన వేడుకలను కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బోడ మంచ్య తండాలో నిర్వహించారు. ఎంపీ జన్మదిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా మానుకోట ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్  పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపీ బలరాం నాయక్ నిత్యం ప్రజా సేవలో నిమగ్నమవుతూ, ఉన్నత పదవులు చేపట్టాలని, భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, పిసిసి సభ్యులు గూగులోత్ దసురు నాయక్,మాజీ జడ్పీటీసీ కదిరే సురేందర్, సొసైటీ మాజీ చైర్మన్ బండారు వెంకన్న, మార్కెట్ డైరెక్టర్ ఎండి అయ్యబ్ ఖాన్,గ్రామ పార్టీ అధ్యక్షుడు బానోత్ చందు, వేముల శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ ముదిగిరి సాంబయ్య, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లం గణేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు షేక్ ముజ్జు, ఎండి సమీర్, తోట అఖిల్,అరుణ్ నాయక్, హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.