calender_icon.png 5 February, 2026 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందుత్వం మా డీఎన్‌ఏ

05-02-2026 12:19:07 AM

8 కోట్ల బకాయి మేయర్ అభ్యర్థి  ఏ విధంగా చెల్లించాడో సిఎం జవాబు చెప్పాలి 

నిజాయితీపరులకే టికెట్లు ఇచ్చాం 

ఎన్నికల కోసం రాజకీయాలు చేయము.. 

ఎంపీ ధర్మపురి అరవింద్ 

నిజామాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): హిందుత్వం మా డిఎన్‌ఏ పొలిటికల్ ఎజెండా కాదు అని ఎంపీ ధర్మపురి అర వింద్ అన్నారు. హిందుత్వ మా బతుకు దెరువు, నినా దం కాదనీ హిందూ రాజ్య స్థాపన కోసం ఎన్నేళ్లయిన పోరాడతామని అన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ లో పరిజ్ఞానం కలిగిన పొలిటిషన్ లేడని ఎంపీ అరవింద ఎద్దేవ చేశారు.  బుధవారం నిజా మాబాద్ జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారూ. గత 17 సంవత్సరాలుగా సుమారు రూ. 8 కోట్ల వరకు బకాయి చెల్లించ కుండా ఉన్న వ్యక్తికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వగానే కొన్ని రోజులోనే సుమారు రూ.8 కోట్ల వరకు బకాయి లు ఎలా ఎలా చెల్లించాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సమాధానం చెప్పా లని ఎంపీ ప్రశ్నించారు.

ఇప్పుడు 8 కోట్ల చెల్లించిన వ్యక్తి చైర్మన్ పదవికి అర్హుడైతే నిజామాబాద్ నగరం ఏమైతుంది ప్రజలు గమనిస్తున్నారు అన్నారు. డబ్బులు ఉండి కూడా ఇన్ని సంవత్సరాల తరబడి చెల్లించాల్సిన బకాయి ఎం దుకు చెల్లించలేదని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాలుగా మేనేజ్ చేసిన వ్యక్తి..ఇవాళ బిజెపి భయానికి ఆస్తి పన్ను చెల్లించాడన్నారు.  కాంగ్రెస్ మేయర్ అభ్యర్టీ ఒక మోసకారి అని, ఒక ద్రోహి, అవి నీతి  పరునికి కాంగ్రెస్ మే ఏర్పడటం కట్టబెట్టాలని చూస్తోందన్నారు. ప్రజల సొమ్ము ఎగ్గొట్టిన వ్యక్తి మేయర్ అయితే నిజమాబాద్ ప్రజలను శ్రీరాముడే కాపాడాలనీ ఎంపీ అన్నారు. నిజామాబాద్ ప్రజలు ఆలోచించి.

ఆ వ్యక్తికి డిపాజిట్ గల్లంత అయ్యేలా బ్యాలెట్ తో బుద్ధి చెప్పలని అరవింద్ ఓటర్లకు పిలుపునిచ్చారు. రేవంత్ కన్నా సోనియా నా ఫ్యామిలికి దగ్గర  కానీ హిందూ వ్యతిరేక పార్టీ అని అందుకనే ఆ అందు లోకి తాను చేరలేదన్నాడు. నా తండ్రి డీఎస్ ని అవమానించి ఆయనను కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు పంపారన్నారు. డీఎస్ ఇంటి మీదపై దాడి చేసిన వ్యక్తు లను కాంగ్రెస్ లో చేర్చుకు న్న నీచ చరిత్ర కాంగ్రెస్ నేతలదనీ ఎంపీ మండి పడ్డారు. నిజామాబాద్ కార్పొరేషన్ లో స్వచ్ఛమైన పరిపాలన మా నినాదం మని ఎంపీ అన్నారు. ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ, బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, బిజెపి నాయ కులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.