21 March, 2026 | 6:11 AM

ఎదిరలో ఆర్వో ప్లాంట్ ప్రారంభం

21-03-2026 01:07 AM

ప్రారంభించిన ఎంపీ డీకే అరుణ

షాద్‌నగర్, మార్చి 20 (విజయక్రాంతి): చౌదర్ గూడా మండలంలోని ఎదిర గ్రామంలో 6.5 లక్షల రూపాయలతో నిర్మించిన ఆర్వో ప్లాంటును మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికె అరుణ శుక్రవారం  ప్రారంభించారు.ఈ సందర్భంగా  ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ వికసిత్ భారత్ గా అభివృద్ధి చెందాలంటే గ్రామాల అభివృద్ధి ఇన్ఫాస్ట్రక్చర్  రోడ్లు విద్యుత్,

పాఠశాలలు అంగన్వాడి కేంద్రాలు ఇవన్నీ ఉన్నప్పుడే గ్రామం అభివృద్ధి చెందిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్రామాలకు ఇస్తున్న నిధులతోనే  గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని మనందరం  సమిష్టిగా పని చేసినప్పుడే గ్రామ అభివృద్ధి తో పాటు దేశ అభివృద్ధి చెందుతుందని అన్నారు.కార్యక్రమంలో  బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్ గుప్తా, అందె బాబయ్య,

దుష్యంత్ రెడ్డి,చెంది మహేందర్ రెడ్డి ,కందూర్ మనోహర్ రెడ్డి ,జి శివారెడ్డి, మచ్చ సుధాకర్ రావు ,మాజీ అధ్యక్షులు బోయ కురుమయ్య ,బోయ శంకర్, పర్వతాపూర్ సర్పంచ్ బోయ అశోక్ డిప్యూటీ సర్పంచ్ వార్డు సభ్యులు మహిళలు బిజెపి వివిధ మండలాల అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.