calender_icon.png 4 July, 2025 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ జన్మదిన వేడుకలు

04-07-2025 01:27:32 AM

విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ

ముషీరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్‌లో బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.  లక్ష్మణ్ పుట్టిన రోజు వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ ఆధ్వర్యంలో జవహర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లోని విద్యార్థులకు నోటు పుస్తకాలు అందచేసారు. ముఖ్య అతిథిగా హాజరైన డా‘ లక్ష్మణ్  కుమారుడు కోవ రాహుల్ చేతుల మీదుగా విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందచేసారు.

అనంతరం బర్త్ డే కేక్  ను పాఠశాల పిల్లలకు పంచిపెట్టారు. ఈ వేడుకలలో సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అద్యక్షులు భారత్ గౌడ్, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్  రమేష్ రామ్, ఓబీసీ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యుడు పూస రాజు, డివిజన్ అధ్యక్షులు వి. నవీన్ కుమార్,

సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, దామోదర్, వి ఎస్ టి  రాజు, ఎం. ఉమేష్, పాల శ్రీను, మహమూద్, శివ కుమార్, బాలకృష్ణ, సురేష్, ఆనంద్ రావు, సాయి కుమార్, భారత్, సత్యేంధర్, జ్ఞానేశ్వర్, నీరజ్, ప్రశాంత్, సంయుక్తా రాణి, పూర్ణ, పాఠశాల ప్రిన్సిపాల్ దేవదాస్,  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.