calender_icon.png 4 July, 2025 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన ఆహారాన్ని అందించాలి

04-07-2025 01:28:06 AM

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కుమ్రం భీం అసిఫాబాద్, జూలై 3(విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం  ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామంలోని తెలంగాణ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలను జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నదీమ్ అహ్మద్ తో కలిసి సందర్శించి వంటశాల, నిత్యవసర సరుకుల నాణ్యత, బియ్యం నిల్వలు, వండిన ఆహారాన్ని పాఠశాల పరిసరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని తెలిపారు. విద్యార్థినిలు ఆరో గ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. గురుకుల పాఠశాల భవనం మూత్ర శాలలు, సౌచాలయాలు, పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండే విధంగా  చర్యలు తీసుకోవాలన్నారు.అనంతరం ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థులతో కలిసి వన మ హోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్క లు నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎల్‌సి పుష్పలత, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.