04-07-2025 01:26:37 AM
ఆర్డీవో లోకేశ్వరరావు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై3 ( విజ యక్రాంతి): ఎన్నికల నిర్వహణలో బూత్ లెవెల్ అధికారుల పాత్ర కీలకమని ఆర్డిఓ లోకేశ్వరరావు అన్నారు.గురువారం రెబ్బెన మండల కేంద్రంలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. గ్రామపం చాయతీ ఎంపీటీసీ, జడ్పిటిసి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైనా బూతు లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించడంతోనే ఓటరు జాబితా రూపకల్పన పకడ్బందీగా అవుతుందన్నారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఓటరు జాబితాలో నూతన ఓటర్ల నమోదు, ఓట్ల తొలగింపు అనేక అంశాలపై బీఎల్వోకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. ఓటర్ జాబితాకు సంబంధించిన ఫామ్ నింపడం తో పాటు ఆన్లైన్ చేయించడంలోనూ ఎలాంటి తప్పులు లేకుండా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరు నడుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసి ల్దార్ సూర్యప్రకాష్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.