భద్రకాళిని దర్శించుకున్న ఎంపీ కావ్య
07-06-2024 01:16 AM
వరంగల్ తూర్పు, జూన్ 6 : వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కుటుంబ సమేతంగా భద్రకాళి అమ్మవారిని దర్శిం చుకు న్నారు. గురువారం ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వా గతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదాశీర్వచనం అందజేశారు.






