16 July, 2026 | 10:16 AM

నిద్రమత్తులో ఔషధ శాఖ అధికారులు

07-06-2024 01:14 AM

మహబూబ్‌నగర్, జూన్ 6 (విజయక్రాంతి) : మనిషి మనుగడకు ఆరోగ్యమైన జీవితం అతిముఖ్యం. కాస్త తలనొప్పి అనిపించినా దగ్గరలోని మెడికల్ షాపులోకి పరిగెడతాం. ఇదే అదనుగా మెడికల్ షాపు నిర్వాహకులు నిబంధనలు గాలికొదిలేస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్నారు. ఇందుకు ఔషధ నియంత్రణ (డ్రగ్స్‌కంట్రోల్) అధికారులు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  మామూళ్లకు అలవాటుపడిన అధికారులు కొందరు.. మెడికల్ దందాను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నారు.  

ఫార్మసిస్టు లేకుండానే 

పట్టణం, పల్లెలు భేదం లేకుండా ఎటు చూసిన మెడికల్ షాపులే కనిపిస్తుంటాయి.  వాస్తవానికి డీఫార్మసీ, బీఫార్మసీ, ఎం. ఫార్మసీ చేసిన వారు మెడికల్ షాపులు, ఏజెన్సీలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే, వీరిలో చాలామంది షాపులు నిర్వ హించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో సర్టిఫికెట్లు ఇతరులకు లీజుకు ఇస్తుంటారు. ప్రస్తుతం ఉన్న షాపుల్లో దాదాపు అద్దె సర్టిఫికెట్లతోనే నడుస్తున్నాయి. దీంతో ఫార్మ సిస్టు ఎక్కడో? కానీ, ఇక్కడ మరొకరు వ్యాపారం సాగిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇష్టారాజ్యంగా మందులు విక్రయిస్తున్నారు. కొందరికి అవగాహన లేక వారిచ్చిన మందులతో అనారో గ్యంపాలైన వారు లేకపోలేదు.