నితిన్ గడ్కరీకి ఎంపీ మల్లు రవి వినతి
ఆమనగల్లు, ఆగస్టు 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో రోడ్డు మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరించాలని ఎంపీ మల్లు రవి బుధవారం పార్లమెంట్ భవనంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విన్నవించారు. ఈ సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ (ఉత్తరభాగం) ఎన్.హెచ్ 161AA పనుల ప్రారంభానికి కేబినెట్ ఆమోదం తెలపాలని,ఆర్.ఆర్.ఆర్ (దక్షి ణ భాగం)అలైన్మెంట్ ఖరారు చేసి, వెంటనే భూసేకరణ ప్రారంభించాలని,
అమరావతి మీదుగా బందర్ పోర్ట్కు అనుసంధానించే ఈ కారిడార్కు మంజూరు ఇవ్వాలన్నారు. అ మ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో నిరంతర ర వాణా కోసం ఎన్ హెచ్ -765 పై 4 లేన్ల కారిడార్ను అనుమతించాలి. ఈ ప్రాజెక్టులు అం దుబాటులోకి వస్తే తెలంగాణ లాజిస్టిక్స్ ర రంగం, ఆర్థిక వ్యవస్థ గణనీయంగా బలోపేతమవుతాయని డాక్టర్ మల్లు రవి స్పష్టం చే శారు. దీనికి మంత్రి అనుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామర్ల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.






