పారదర్శక జనగణనే లక్ష్యంగా పటిష్ట చర్యలు
రాష్ట్ర సెన్సస్ (జనగణన) డైరెక్టర్ భారతి హోళికేరి
చేగుంట, ఏప్రిల్ 21 : చేగుంట మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో జరుగుతున్న ఎన్యుమరేటర్లకు ,సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమ ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనగణన డైరెక్టర్ భారతి హోళీ కేరి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన మొదటి విడత మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించడం జరుగుతుందని, జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసామన్నారు.
ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లి 33 రకాల ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలని తెలిపారు. పకడ్బందీగా జన గణన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో జై చంద్ర రెడ్డి, స్థానిక తహసిల్దార్, అధికారులు పాల్గొన్నారు.






