14 August, 2026 | 3:25 AM

ఘనంగా ఎంపీ రేణుక చౌదరి జన్మదిన వేడుకలు

14-08-2026 12:00 AM
  1. అన్న వితరణ నిత్యావసర వస్తువుల పంపిణీ 
  2. సీనియర్ కాంగ్రెస్ నేత జవ్వాజి నాయకత్వంలో వేడుకలు

మధిర, ఆగస్టు 13(విజయ క్రాంతి): రాజ్యసభ సభ్యురాలు మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి జన్మదిన వేడుకలను గురువారం మధిర లో ఘనంగా నిర్వహించారు. ఆమె అనుచరుడు మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు జవ్వాజి ఆనందరావు ఆధ్వర్యంలో పట్టణంలోని క్యాంపు కార్యాలయం లో అనుచరులు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఫోన్ ద్వారా ఆమెకు ప్రతి ఒక్క కార్యకర్త శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్టణంలోని ఆదరణ సేవా సంస్థ లో వృద్ధులు అనాధలకు  అన్న వితరణ,నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా జవాజి ఆనందరావు మాట్లాడుతూ... కేంద్ర మంత్రిగా పనిచేసిన కాలంలో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసి జిల్లా సమగ్ర అభివృద్ధికి తన వంతు బాధ్యతను నిర్వహించిన ఘనత రేణుక చౌదరి దే అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు సముచిత గౌరవాన్ని కల్పిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకురాలు రేణుక చౌదరి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు  కర్లపూడి అప్పారావు,  నాయకులు ఆవులు గురుబ్రహ్మం, జిల్లేపల్లి ప్రసాద్ సత్యనారాయణ రెడ్డి  లతోపాటు పలువురు పాల్గొన్నారు.