14 August, 2026 | 1:32 AM

దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో విశ్వేశ్వర స్వామికి జలాభిషేకం

14-08-2026 12:00 AM

దోమకొండ,ఆగస్టు 13 (విజయ క్రాంతి):  దోమకొండ మండల కేంద్రంలో స్థానిక శివరాం మందిర్ ఆలయంలో శ్రీ విశ్వేశ్వర స్వామికి గురువారం భక్తులు జలాభిషేకం చేశారు. భక్తులు వందలాదిగా తరలివచ్చి గ్రామంలో సన్నాయి వాయిద్యాలతో క్యూలైన్లో శివనామస్మరణతో గ్రామ పురువీధులనుండి స్థానిక కుడి చెరువు వద్దకు వెళ్లి జలాన్ని తీసుకొని తలపై పెట్టుకుని స్థానిక శివరాం మందిర్ కి వచ్చి జలాభిషేకం నిర్వహించారు. ఆలయంలో వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల 

మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయం కు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాద వినియోగంతో పాటు సౌకర్యాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో దోమకొండ శివరాం మందిర్ ఆలయ కమిటీ అధ్యక్షులు కొండ అంజయ్య ఆలయ ధర్మకర్తలు, నగరం నర్సింలు, నాయిని లింగారెడ్డి, చింతల చిరంజీవి, చిన్నం స్వాతి శేఖర్, ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ, భక్తులు పాల్గొన్నారు.