ఉపాధి హామీ పనులు పరిశీలించిన ఎంపీడీవో
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని చినూరు గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను సందర్శించి పరిశీలించారు.అలాగే పోచారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపిటిఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ...ఉపాధి హామీ పనుల నిర్వహణ సక్రమంగా కొలతల ప్రకారము చేయాలన్నారు.గ్రామంలో ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులకు హాజరై దినసర కూలి 308 పొంది మీ జీవిత చక్రాన్ని ముందుకు సాగించాలన్నారు.
ఎండల తీవ్రత ఎక్కువ అయినందున కూలీలు ఎండల అనుసారం పనులు చేపట్టాలన్నారు.జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులకు హాజరు కావాలన్నారు. అలాగే పోచారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణలు త్వరగా పూర్తి కావాలని పనులు నాణ్యతతో చేపట్టాలని పనుల్లో ఎలాంటి నాణ్యత లోపం ఉండకూడదని పేద ప్రజల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పోచారం గ్రామ సర్పంచ్ సంజీవరావు, కార్యదర్శి భాస్కర్, చినూర్ ఫీల్డ్ అసిస్టెంట్ అంజయ్య తదితరులు ఉన్నారు.






