09-02-2026 03:57:09 PM
వాంకిడి,(విజయక్రాంతి): మండలంలోని బంబార గ్రామపంచాయతీలోని నర్సరీలో చేపడుతున్న పనులను ఎంపీడీవో జ్యోత్స్న సోమవారం పరిశీలించారు. అలాగే గ్రామ పంచాయతీలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు, దిశా పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న వంటశాల పనులను కూడా ఆమె పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ... గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీలో ఆరు వేలకుపైగా మొక్కలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరితగతిన బ్యాక్‌ఫిల్లింగ్ పూర్తి చేసి విత్తనాలు వేయాలన్నారు. మొక్కల ఎదుగుదలకు అవసరమైన జీవామృతాన్ని తయారు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బెండారే కృష్ణాజీ, పంచాయతీ కార్యదర్శి ధర్మయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణ చారి, నర్సరీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.