calender_icon.png 9 February, 2026 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరిఖనిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం

09-02-2026 04:05:57 PM

గోదావరిఖని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సోమవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించారు.  గోదావరిఖనికి విచ్చేసిన కిషన్ రెడ్డికి బిజెపి పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. గోదావరిఖని పట్టణంలో రోడ్ షో నిర్వహించి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థుల కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కిషన్ రెడ్డి ప్రజలను కోరారు. బిజెపి పార్టీని గెలిపిస్తే గోదావరిఖని పట్టణాన్ని కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు.