23 March, 2026 | 11:43 PM

మండేపల్లిలో ఇందిరమ్మ గృహాల నిర్మాణంపై ఎంపీడీవో సమీక్ష

07-01-2026 07:01 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని మండేపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ గృహాలను ఎంపీడీవో లక్ష్మీనారాయణ శుక్రవారం సందర్శించారు. గ్రామానికి మొత్తం 43 ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకాగా, వాటిలో 20 ఇళ్లకు స్లాబ్ నిర్మాణం పూర్తయినట్లు ఆయన తెలిపారు. మిగిలిన ఇళ్లను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు.