calender_icon.png 8 January, 2026 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాలెట్ పద్ధతిని కోరుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం

07-01-2026 07:07:58 PM

బిజెపి సీనియర్ నాయకురాలు బచ్చు కృష్ణ ప్రియ మల్లారెడ్డి

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో దొంగ ఓట్లను వేయించుకోవడానికే బ్యాలెట్ పద్ధతిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించుకుందని మేడ్చల్ మండల బిజెపి సీనియర్ నాయకురాలు బచ్చు కృష్ణ ప్రియ మల్లారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో రిగ్గింగ్ లకు పాల్పడవచ్చనే ఆలోచనలతో బ్యాలెట్ బాక్స్ లను గుండాతో తగలబెట్టించే అవకాశం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని బ్యాలెట్ ఎన్నికల పద్ధతిని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందని ఆమె స్పష్టం చేశారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ఈవీఎంలతో వాళ్లు అనుకున్నన్నీ ఆటలు ఆడలేక పోతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయాలని మాయలు చేయలేకపోతున్నారని కృష్ణప్రియ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీని ఆమె అన్నారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ఎన్ని కుట్రలు కుతంత్రాలకు పాల్పడిన భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే శక్తి బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు లేదని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన విషయాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారని బచ్చు కృష్ణ ప్రియ మల్లారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.