calender_icon.png 9 January, 2026 | 3:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలి

07-01-2026 06:58:07 PM

చిట్యాల,(విజయక్రాంతి): విద్యార్థి దశ నుండే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశగా పట్టుదలతో కృషి చేయాలని ఇంపాక్ట్ ఫౌండేషన్ రీజనల్ డైరెక్టర్ గూడూరు అంజిరెడ్డి అన్నారు. బుధవారం చిట్యాల పట్టణ కేంద్రంలోని లయోలా టెక్నో హై స్కూల్ లో  నిర్వహించిన మోటివేషనల్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను పెట్టుకున్నప్పుడే వాటిని సాధించేందుకు క్రమశిక్షణతో పట్టుదలతో కృషి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను గురువులను గౌరవించడంతోపాటు దేశభక్తిని కలిగి ఉండాలన్నారు.