calender_icon.png 4 October, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలకృష్ణ 111వ సినిమాకు ముహూర్తం ఫిక్స్

04-10-2025 12:39:46 AM

నందమూరి బాలకృష్ణ వరుస చిత్రాలతో అలరిస్తున్నారు. ఇప్పుడు ఆయన 111వ సినిమా కోసం సిద్ధమయ్యారు. హిస్టారికల్ ఎపిక్ గా రూపొందనున్న ఈ సినిమాను బాలకృష్ణ పుట్టినరోజున అధికారికంగా ప్రకటించారు. బాలకృష్ణ ’వీరసింహ రెడ్డి’ తర్వాత గోపీచంద్ మలినేనితో కలిసి చేస్తున్న రెండో చిత్రం ఇది. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీశ్ కిలారు నిర్మించనున్నారు.

విజయ దశమి శుభ సందర్భంగా ఎన్ బీకే111 నిర్మాతలు ఈ చిత్రం ప్రారంభానికి ముహూర్తం ప్రకటించారు. అక్టోబర్ 24న ప్రారంభ వేడుక జరగనుంది. దర్శకుడు గోపీచంద్ మలినేని మొదటిసారి హిస్టారికల్ ఎపిక్ జానర్ లో ఈ సినిమా రూపొందిస్తున్నారు. గొప్ప చారిత్రక నేపథ్యంలో సెట్ చేయబడిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ చివరి దశలో వుంది. సహాయక తారాగణం, సాంకేతిక సిబ్బంది వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

అఖండ 2: తాండవం వచ్చేది అప్పుడే 

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల నాలుగో కొలాబరేషన్‌లో చిత్రం ‘అఖండ 2: తాండవం’.  వీరి కాంబోలో వచ్చిన ‘అఖండ’కు సీక్వెల్ గా రూపొందుతోందీ సినిమా. ఇప్పుడీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. 14 రీల్స్ ప్లస్ బ్యాన్ప రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తోంది. ఆది పినిశెట్టి ఓ శక్తిమంతమైన పాత్రలో, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. సీ రాంప్రసాద్, సంతోష్ డీ డెటాకీ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్ గా, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.