04-10-2025 12:38:19 AM
చిరంజీవి తన అప్ కమింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకరవర ప్రసాద్ గారు‘తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక. ఈ ప్రాజెక్ట్ షైన్ స్క్రీన్స్, గోల్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.
2026లో సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలోకి రానుంది. దసరా సందర్భంగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ ’మీసాల పిల్ల’ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియోలో అనిల్ రావిపూడి స్టైల్లోని సరదా టచ్, అలాగే లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ్ పాడిన ఫస్ట్ సింగిల్ మీసాల పిల్లని పరిచయం చేశారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్గా, తమ్మిరాజు ఎడిటర్గా, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్గా పని చేస్తున్నారు.