30-12-2025 02:31:34 PM
ఉత్తర ద్వారం దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు
తాండూరు,(విజయక్రాంతి): ముక్కోటి ఏకాదశి సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రధానంగా తాండూరు మండలం చంద్రగిరి (దస్తగిరి పేట)లో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకునేందుకు వేకువ జాము నుండే భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారు మ్రోగింది. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. మరోవైపు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిర్వాహకులు క్యూలైన్ భారీకేడ్లు ,త్రాగునీరు తదితర ఏర్పాట్లు చేశారు.