30-12-2025 02:34:58 PM
నటల నివారణ మందును సద్వినియోగం చేసుకోవాలి
గిరిపురం గ్రామ సర్పంచ్ నీలా సైదులు
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం గ్రామపంచాయతీలో నట్టల నివారణ మందుతో మూగజీవుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని లైవ్ స్టాక్ ఆఫీసర్ రందాన్ పేర్కొన్నారు. మండలంలో మూగజీవులకు పశువు సమర్ధక శాఖ ఆధ్వర్యంలో గిరిపురం గ్రామ సర్పంచ్ నీలా సైదులు చేతుల మీదుగా నట్టల నివారణ మందు పంపిన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా లైవ్ స్టాక్ ఆఫీసర్ మాట్లాడుతూ గొర్రెలకు, మేకలకు నట్టల మందు తాపించినట్లు తెలిపారు. ఈ మందు ద్వారా మరణాలు తగ్గి ,జీవాల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలోసర్పంచ్ బాదాత్ నీలా సైదులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వల్లేపు కొండయ్య, పట్ల మల్లయ్య, పెద్ధబోయిన కుమార్ స్వామి, పెధ్దబోయిన సమ్మయ్య, రైతు వెంకన్న, వల్లపు సమ్మయ్య, పట్ల వంశీ తదితరులు పాల్గొన్నారు.