2 June, 2026 | 2:43 AM

‘ముంబై రైజింగ్ స్టార్ అవార్డ్స్’

02-06-2026 12:00 AM

పోస్టర్ ఆవిష్కరణ

ముషీరాబాద్, జూన్ 1(విజయక్రాంతి): ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎఫ్టీపీసీ ఇండియా) ఆధ్వర్యంలో జూలైలో ముంబైలో నిర్వహించ నున్న ’ముంబై రైజింగ్ స్టార్ అవారడ్స్-26’ పోస్టర్ను సోమవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రముఖ దర్శకుడు వీరభద్ర చౌదరి, బాలీవుడ్ నటీమణులు ప్రతిమ మౌర్యా, సెజల్, స్నేహా అగర్వాల్, శర్బరి దాస్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎఫ్టీపీసీ ఇండియా అధ్యక్షుడు చైతన్య జంగా, ప్రధాన కార్యదర్శి విజయ్ వర్మ పాకాలపాటి మాట్లాడుతూ నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించే లక్ష్యంతో అవార్డులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన యువ సినీ ప్రతిభావంతులకు ఈ వేదిక అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల యువతారలు కూడా కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఐటీ వింగ్ చైర్మన్ కోడె చైతన్య, కార్యవర్గ సభ్యులు, సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.