మున్సిపల్ వాటర్ ట్యాంకర్ బోల్తా
04-06-2026 03:19 PM
– తప్పిన పెను ప్రమాదం.
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ మున్సిపాలిటీకి చెందిన వాటర్ ట్యాంకర్ ఉయ్యాలవాడ సమీపంలో ప్రమాదానికి గురైంది. వివరాల్లోకి వెళ్తే, నీరు నింపుకొని తిరిగి వస్తున్న సమయంలో ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు మున్సిపల్ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. వాహనం మాత్రం తీవ్రంగా దెబ్బతింది. ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఆందోళన నెలకొంది.






