హత్య చేసి నగల అపహరణ
కాళ్ల గజ్జల కోసం గొంతు కోసి కాళ్లు నరికిన దుండగులు
చేవెళ్ళ, మే 27 (విజయక్రాంతి): ఒంటిమీదున్న నగల కోసం ఓ మహిళ గొంతు కోసి రెండు కాల్లు చీలమండల వరకు నరికేసి మహిళాను హత్య చేసిన ఘటన చేవెళ్ళ పిఎస్ పరిధిలోని ధర్మసాగర్ రెవెన్యూలో జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలప్రకారం... చేవెళ్ల మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన ఎరుకల మైసమ్మ 48 సోమవారం సాయంత్రం స్వగ్రామం ధర్మసాగర్లోని తన ఇంటి నుంచి బయలుదేరింది.
గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో ఈర్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 47లో నిర్మానుష్య ప్రదేశంలో హత్యకు గురైంది. మంగళవారం మధ్యాహ్నం 12:30 కొందరి వ్యక్తుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలు గొంతుకోసి రెండు కాళ్ళు నరికి సుమారు 50 తులాల బరువున్న వెండి కాళ్ల గజ్జెలను దొంగిలించారు. మృతురాలు కుమారుడు సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






