calender_icon.png 3 February, 2026 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12వ వార్డు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా

03-02-2026 02:36:50 AM

బీఆర్‌ఎస్ అభ్యర్థి ఠాకూర్ స్వాతి గణేష్ 

జిన్నారం/అమీన్ పూర్, ఫిబ్రవరి 2 గడ్డపోతారం మున్సిపల్ మాదారం వార్డు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని 12వ వార్డు బిఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఠాకూర్ స్వాతి గణేష్ తెలిపారు. వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్లు నిర్మాణం చేపడతానని ఆమె స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం గడ్డపోతారం మున్సిపల్  పరిధిలో గల మాదారం 12వ వార్డులో గడపగడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. ముందుగా పరిష్కరించాల్సిన సమస్యలను గుర్తించి తొలి ప్రాధాన్యతగా భావించి పరిష్కరిస్తానని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. వార్డు ప్రజలకు ఏ సమస్య వచ్చిన వెంటనే నా దృష్టికి తెస్తే పరిష్కరిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వార్డు ప్రజలు నన్ను ఆదరించి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు శ్రీశైలం గౌడ్, రామకృష్ణ గౌడ్, వెంకటేష్ గౌడ్, నారాయణ, శంకర్, కిషన్ సింగ్, రాజు, ప్రవీణ్, శేఖర్ కార్యకర్తలు పాల్గొన్నారు.