వ్యక్తి హత్య
20-08-2026 12:24 AM
- మహబూబాబాద్ జిల్లా మడిపల్లిలో ఘటన
- కంబాలపల్లిలో మరొకరి ఇల్లు దగ్ధం
మహబూబాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో బుధవారం పాత కక్షల తో ఒకరి ఇల్లు దగ్ధం చేయగా, మరొక ఘటనలో ఒ కరిని హత్య చేసిన సంఘటనలు చోటు చేసుకున్నా యి. పాత కక్షలు నేపథ్యంలో తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం గుంటుక రమేష్ (39) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఇటీవల జరిగిన ఓ ఘర్షణ ర మేష్ హత్యకు దారితీసిందని, తమ కళ్లెదుటే రమేష్ ను ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లి చదువు వద్దకు తీసుకెళ్లి కర్రలు, బండరాళ్లతో దారుణంగా కొట్టి చంపారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మహబూబాబాద్ మండ లం కంబాలపల్లిలో రాజు, రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య పాత గొడవలు ఉన్నాయి. ఈ నేప థ్యంలో రాజు రామకృష్ణ ఇంటిని పెట్రోల్ పోసి అంటించాడు.






