20 August, 2026 | 1:15 AM

నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగు

20-08-2026 12:23 AM

మొయినాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): కేతిరెడ్డిపల్లి క్లస్టర్లో ATMARPL ఆధ్వర్యంలో రైతులకు ఆరుతడి పంటలు, వరి సాగు, సమగ్ర పంటల యాజమాన్యంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. పంటల శాస్త్ర విభాగం డివిజన్ హెడ్ వి. మారుతి, CRIౄA సీనియర్ శాస్త్రవేత్త డా. ఏ.జి.కె. రెడ్డి రైతులకు IPM, INM, నానో ఎరువుల వినియోగం, మల్చింగ్, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించారు.

వరి సాగులో నాణ్యమైన రకాల ఎంపిక, నారుమడి పెంపకం, సరైన సమయంలో నాట్లు, సమతుల్య ఎరువుల వినియోగం, కలుపు, చీడపీడల నియంత్రణపై వివరించారు. నీటిని పొదుపుగా వినియోగించడంతో పాటు నేలలో తేమను కాపాడేందుకు మల్చింగ్ వంటి పద్ధతులను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి. అనురాధ, ఏఈఓలు దీనా, శ్రీనివాస్, కేతిరెడ్డిపల్లి క్లస్టర్ రైతులు పాల్గొన్నారు.