కెమెరా కన్నుతో ప్రపంచాన్ని చూపించడమే ‘ఫొటోగ్రఫీ’
20-08-2026 12:24 AM
మొయినాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొయినాబాద్ మండలం లోని పీకాక్ ఫోటోగ్రఫీ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం వేడుకలు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్యూరే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు మాట్లాడు తూ.. ఒక్క ఫొటో ఎన్నో జ్ఞాపకాలను పదిలంగా ఉంచుతుందని, కాలం గడిచినా ఆ క్షణాలను కళ్లముందు నిలిపేది ఫోటోగ్రఫీ కళేనని అన్నారు. కార్యక్రమంలో పీకాక్ ఫోటోగ్రఫీ యూనియన్ మండల అధ్యక్షుడు శశిధర్, వాసు, మాణిక్ రెడ్డి, విష్ణు, నరసింహ, శ్రవణ్, మధు, నాగరాజ్, నవీన్, నరేష్, రామకృష్ణ తదితర ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.






