calender_icon.png 6 December, 2024 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రాల నెపంతో వ్యక్తి దారుణహత్య

27-09-2024 01:11:27 PM

మహబూబాబాద్, విజయక్రాంతి: తనకు చేతబడి చేశాడనే నెపంతో ఓ వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం, చిన్నముప్పారం గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మల్లం యాకయ్య అనే వ్యక్తిని మంత్రాలు చేసాడనే నెపంతో గ్రామస్థులు చూస్తుండగానే కర్రతో దారుణంగా కొట్టి చంపాడు. దీనితో గ్రామస్థులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. హత్యకు పాల్పడ్డ వ్యక్తిని గ్రామస్థులు, మృతుని కుటుంబ సభ్యులు పట్టుకుని తాళ్లతో చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై రమేష్ నిందితున్ని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.