calender_icon.png 19 May, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరహంతకుడు సైపుల్లా హతం

19-05-2025 01:16:59 AM

భారత్‌లో పలు దాడులకు వ్యూహం

ఇస్లామాబాద్, మే 18: భారత్‌లో అనేక దాడులకు స్కెచ్చేసిన లష్కరేెేఇో తయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ ఆదివారం గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో హతమయ్యాడు. పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో సైఫుల్లాను హతమార్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

నేపాల్‌లో తప్పుడు ధృవీకరణలతో కొన్నాళ్లు జీవించిన సైఫుల్లా అక్కడే నగ్మా బాను అనే స్థానిక మహిళను వివాహం చేసుకున్నాడు. నేపాల్ నుంచే ఎవరికీ అనుమానం రాకుండా ఎల్‌ఈటీ కార్య క్రమాలు చక్కబెటాడు. ఇటీవలే నేపాల్ నుంచి పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్‌లోని మట్ల్లీకి మకాం మార్చాడు. 

భారత్‌లో ఎన్నో దాడులకు స్కెచ్

దుండగుల దాడిలో హతమైన సైఫుల్లా భారత గడ్డపై దాడులు చేసేందుకు అనేక ప్రణాళికలు రచించాడు. ప్రధానంగా మూ డు భారీ ఉగ్రదాడుల్లో సైఫుల్లా హస్తం ఉన్న ట్టు అంతా భావిస్తారు. 

F2001లో రాంపూర్‌లోని సీఆర్‌పీఎఫ్ దాడి

F2005లోని బెంగళూరులో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్‌సీ)పై దాడి. 

F2006లో నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంపై దాడి.