calender_icon.png 19 May, 2025 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

19-05-2025 02:20:17 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఆపరేషన్ సింధూర్ వివరాలను మీడియాకు తెలియజేసిన ఆర్మీ ఆఫీసర్ కల్నల్ సోఫియా ఖురేషీతో పాటు భారత సైన్యంపై మధ్యప్రదేశ్ రాష్ట్ర గిరిజన వ్యవహారాల మంత్రి కున్వర్ విజయ్ షా ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి విజయ్ షా  క్షమాపణలు అంగీకరించలేం అని, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు అచితూచి మాట్లాడాలని చివాట్లు పెట్టింది. అయన వ్యాఖ్యలపై విచారణకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశిస్తూ ముగ్గురు సీనియర్ ఐపీఎస్ లతో కూడిన సెట్ ఏర్పాటు చేసింది. ముగ్గురు ఐపీఎస్ ల సిట్ లో ఒక మహిళ ఉండాలని, ఈనెల 28లోగా నివేదిక ఇవ్వాలని కోర్టు సూచించింది.

మంత్రి విజయ్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు వ్యాఖ్యలను సవాలు చేస్తూ ఆయన సుప్రీకోర్టు ఆశ్రయించారు. అయితే, శుక్రవారం జస్టిస్ కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం మంత్రి విజయ్ షా స్పెషల్ లీవ్ పిటిషన్ నిచారించలేకపోయింది. పిటిషనర్ అభ్యర్థన మేరకు ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎన్కే సింగ్ లతో కూడిన డివిజన్ ఇవాళ విచారించింది. మంత్రి తీరుపై మండిపడిన న్యాయస్థానం స్పెషల్ లీవ్ పిటిషన్ జాబితా గురించి మధ్యప్రదేశ్ హైకోర్టుకు తెలియజేయాలని సీనియర్ న్యాయవాదికి చీఫ్ జస్టిస్ సూచించారు. ఆర్మీ ఆఫీసర్ కల్నల్ సోఫియా ఖురేషీని ఉగ్రవాదుల సోదరి అని పేర్కొన్నడం ముస్లిం సమాజం మనోభావాలను దెబ్బతీయడం నేరమని జస్టిస్ శ్రీధర్ ధర్మాసనం వెల్లడించింది.