06-05-2025 12:00:00 AM
కరీంనగర్, మే 5 (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గడువు ముగిసినందున అక్రమంగా కరీంనగర్ లో ఉంటున్న పాకిస్తాన్ జాతీయులను గుర్తించి వెంటనే వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని బిజెపి నాయకులు కోరా రు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు కృష్ణా రెడ్డి, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.