calender_icon.png 8 December, 2025 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ స్టేషన్ నుండి నిందితుల పరారీ

08-12-2025 08:23:53 PM

హన్మకొండ స్టేషన్ లో ఘటన..

హనుమకొండ (విజయక్రాంతి): ఓ చోరీ కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన హనుమకొండ పోలీసులు వారిని పోలీస్ స్టేషన్లో ఉంచగా నిన్న అర్ధరాత్రి స్టేషన్ నుండి తప్పించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పోలీస్ కమిషనరేట్ కు కూతవేటు దూరంలో ఉన్న హనుమకొండ పోలీస్ స్టేషన్ నుండి ముగ్గురు నిందితులు తప్పించుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా తప్పించుకున్న ముగ్గురు నిందితుల కోసం హనుమకొండ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్టు తెలిసింది.

ఇటీవల ఇతర రాష్ట్రానికి చెందిన నలుగురు గంజాయి నిందితులను నార్కోటిక్స్ పోలీసులు పట్టుకొని హనుమకొండ పోలీసులకు అప్పగించారు. హనుమకొండ పోలీసు స్టేషన్ కంప్యూటర్ రూమ్ నుంచి సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు సెంట్రీ డ్యూటీ పోలీసుల కళ్లు గప్పి కంప్యూటర్ రూమ్ వెనుక భాగం డోర్ పగలగొట్టి ముగ్గురు దొంగలు పరార్ అయ్యారని తెలిసింది. ఈ విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ కావడంతో పారిపోయిన దొంగలను పట్టుకోవడానికి హనుమకొండ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.