1 August, 2026 | 8:00 AM

పోక్సో చట్టంపై అవగాహన ఉండాలి

04-09-2025 12:00 AM

-జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు

-పిల్లలపై లైంగిక నేరాలు నివారించాలి: కలెక్టర్, ఎస్పీ పిలుపు

ఆదిలాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాం తి):  పిల్లల సంరక్షణ చట్టాల పై అవగాహన కల్పించేందుకే ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర రావు అన్నారు. పిల్లల భద్రత, పోక్సో చట్టం పై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం నిర్వహించిన ‘రైజింగ్ 2047‘ కార్యక్రమంలో భాగంగా ఈనెల 2, 3 తేదీలలో రెండు రోజుల నిర్వహించే అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్  రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లతో కలిసి పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం అవగాహన కార్యక్రమానికి సంబం ధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులు, చైల్ వెల్ఫేర్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లల రక్షణ, పోక్సో చట్టంలోని ప్రధాన అంశాలు, ఉపాధ్యాయుల బాధ్యతలు వంటి అంశాలపై చర్చించినారు. అనంతరం జిల్లా జడ్జి మాట్లాడుతూ 2012 చట్టం పై అవగాహన కలిగి ఉండాలని ఆన్నారు.

ఎన్ని చట్టా లు వచ్చిన మనషుల ఆలోచనలో మార్పు రానంత వరకు అన్ని వృధా ఆన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలను తెలుసుకోవాలని, ఉపాద్యాయులు విద్యార్ధులను మీ పిల్లలుగా భావించి బాల్యాన్ని కాపాడాలని ఆన్నారు. విద్యా సంస్థలన్నీ పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఏవైనా అనుమానాస్పద సంఘటనలు వెలుగులోకి వస్తే వెంట నే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. 

కలెక్టర్ రాజర్షిషా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌లు మాట్లాడుతూ... పిల్లలపై లైంగిక నేరాలను నివారించేందుకు రూపొందించబడిన పోక్సో చట్టంపై ఉపాధ్యా యులు, తల్లిదండ్రులు,  బాలల సంరక్షణలో ఉన్న ప్రతి ఒక్కరికీ పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డీబ్లువో మిల్కా, డీఎస్పీ జీవన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.