1 August, 2026 | 6:56 AM

పంట నష్టపోయిన రైతుకు పరిహారం అందిస్తాం

03-09-2025 12:27 AM

-మంత్రి గడ్డం వివేక్

చెన్నూర్, సెప్టెంబర్ 2: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలో పంట నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మి క, ఉపాధి శిక్షణ, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళ వారం చెన్నూర్ మండలంలోని సుందర శాల గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వలన నష్టపోయిన పంట పొలాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదల కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా ఐదేండ్ల నుంచి రైతులు పం ట నష్టపోతున్నారని, గత ఏడాది కూడా పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించామన్నారు.

సుమారు 200 ఎకరాల మేర పంట నష్టం జరిగినట్లు రైతులు మంత్రి దృష్టికి తీసుకురాగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో స్పష్టమైన నివేదికలు రూపొందించి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిహారం మంజూరయ్యే విధంగా కృషి చేస్తానని హామి ఇచ్చారు. అనంతరం దుగ్నేపల్లి జీపీలోని పెద్దగూడెం, నారాయణపూర్ గ్రామాలలో పర్య టించి ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పథకాలు, సౌకర్యాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

తకు ముందు చెన్నూర్ పట్టణంలోని ఎంఎల్‌ఏ క్యాంపు కార్యాలయంలో కొలువుదీరిన గణనాథుడికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి వెంట సంబంధిత అధికారు లు, ప్రజా ప్రతినిధులు తదితరులున్నారు.

లోతట్టు ప్రాంతాలు పరిశీలన

కోటపల్లి (చెన్నూర్), సెప్టెంబర్ 2 : కోటపల్లి మండలంలోని ప్రాణహిత, గోదావరినది తీరంలోని లోతట్టు ప్రాంతాలను కార్మిక, ఉపాధి శిక్షణ, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి మంగళ వారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. కోటపల్లి మండలం అన్నారం గ్రామం లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.

ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉంటూ అత్యవసర సేవలు అందిస్తారన్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, వర్షపు నీరు నిలువ ఉండకుండా అంతర్గత రహదారులు, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట సంబంధిత శాఖ అధికారులు, నాయకులు తదితరులున్నారు.