calender_icon.png 9 May, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలకు చేయాలి

08-05-2025 12:38:40 AM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, మే 7 ( విజయక్రాంతి ) : వరి ధాన్యం సరసమైన సగటు నాణ్యత (ఎఫ్. ఎ . క్యూ) నిబంధనలకు  అనుగుణంగా కొనుగోలు జరిగేవిధంగా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుండి మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణాధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల  కొనుగోలు కేంద్రాలు సందర్శించినప్పుడు చాలా చోట్ల వరిలో  తాలు, మట్టి, గడ్డి ఎక్కువగా కని పిస్తుందని అన్నారు.  నాణ్యమైన వడ్లు ఇవ్వకుంటే మిల్లర్లు తీసుకోడానికి ఇష్టపడరని అదేవిధం గా వారికి ఇచ్చిన వడ్ల నుండి నాణ్యమైన బియ్యం సేకరించాల్సి ఉంటుందన్నారు.  మండల వ్యవసాయ అధికారులు, ఎ.ఈ.ఒ లు ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలను సందర్శించి వడ్లలో గడ్డి, తాలు, మట్టి లేకుండా సరైన తేమతో కూడిన వడ్లు కొనుగోలు చేసే విధంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించాలన్నారు.

వడ్లను తూర్పు పట్టి , ఎండబెట్టి ఇచ్చేవిధంగా రైతులకు సైతం అవగాహన కల్పించాలని సూచించారు . కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తప్పులు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఎఫ్. ఎ.క్యూ  ప్రమాణాలతో ఇచ్చిన  వడ్లను మిల్లర్లు  సకాలంలో దించుకోకున్నా ,  లేక తరుగు పేరుతో కోతలు విధించిన మిల్లులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

సరసమైన సగటు నాణ్యత నిబంధనల ప్రకారం నాణ్యమైన వడ్లు మిల్లులకు ఇవ్వాల్సిన బాధ్యత రైతులు, వ్యవసాయ అధికారుల పై ఉందన్నారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, జిల్లా  వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్,  జిల్లా సివి ల్ సప్లై అధికారి విశ్వనాథ్, జిల్లా కోఆపరేటివ్ అధికారి బి.రాణి, వ్యవసాయ మండల, క్లస్టర్ అధికారులు,  తదితరులు వి. సి లో పాల్గొన్నారు.